- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం.. అమెరికా రియాక్షన్ ఇదే..!
పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack)తో ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాయాది పాక్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack)తో ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాయాది పాక్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. పీవోకే (POK) కేంద్రంగా ఉన్న మొత్తం ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత్ సైనిక చర్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలోనే భారత్ ‘ఆపరేషన్ సింధూర్’పై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) స్పందించారు. కౌంటర్‌గా పాక్ ఎలాంటి చర్యల తీసుకొవద్దని సూచించారు. భారత్‌పై యుద్ధానికి ధైర్యం చేయవద్దని సలహా ఇచ్చారు. ఉగ్రవాదులపై చర్య తీసుకుని హక్కు భారత్‌కు ఉందని ‘ఆపరేషన్ సింధూర్’పై పాక్ ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని అన్నారు. అదేవిధంగా పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులను భారత విదేశాంగ శాఖ అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా దేశాలకు వివరించింది.






