ఆప‌రేష‌న్ సింధూర్ అస‌లైన నివాళి..ప‌హ‌ల్గామ్ బాధితుల రియాక్షన్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-07 03:32:55  IST  )

ఆప‌రేష‌న్ సింధూర్ పై ప‌హ‌ల్గామ్ మృతుల కుటుంబాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఆప‌రేష‌న్ సింధూర్ అస‌లైన నివాళి..ప‌హ‌ల్గామ్ బాధితుల రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ఆప‌రేష‌న్ సింధూర్ పై ప‌హ‌ల్గామ్ మృతుల కుటుంబాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి. ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన సంతోష్ జాగ్డాలే కూతురు అస‌వారీ జాగ్డాలే చ‌నిపోయిన‌వారికి ఇదే అస‌లైన నివాళి అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆప‌రేష‌న్ సింధూర్ గురించి తెలిసి చాలా ఏడ్చిన‌ట్టు తెలిపారు. మృతుడు సంజ‌య్ ద్వివేది తండ్రి శుభ‌మ్ ద్వివేది మాట్లాడుతూ..తాను రాత్రంతా న్యూస్ చూస్తున్నాన‌ని చెప్పారు. ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాని మోడీ, ఇండియ‌న్ ఆర్మీకీ సెల్యూట్ అన్నారు. దేశం బాధ‌ను అర్థం చేసుకున్నార‌ని చెప్పారు. పాకిస్థాన్ లోని టెర్ర‌రిస్టుల‌ను ఇండియ‌న్ ఆర్మీ అంతం చేయాల‌ని అన్నారు. త‌న కుటుంబం అంతా ఆప‌రేష‌న్ సింధూర్ వార్త విన‌గానే కాస్త కుదుట‌ప‌డ్డామ‌ని చెప్పారు.

Next Story