‘ఆపరేషన్ కగార్’ ఎఫెక్ట్.. 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-30 07:24:03  IST  )

దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ కగారు’ ముమ్మరంగా కొనసాగుతోంది.

‘ఆపరేషన్ కగార్’ ఎఫెక్ట్.. 17 మంది మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, వెబ్‌డెస్క్/కొత్తగూడెం ప్రతినిధి: దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ కగారు’ ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భద్రతా దళాలు ప్రతి ఇంచు జల్లెడ పడుతున్నాయి. ఇటీవల కర్రిగుట్టలు, నారాయణపూర్ మాధ్ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యల మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు ఆపరేషన్ చూయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కొత్తగూడెంలో మొత్తం 17 మంది దళ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. అందులో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే, లొంగిపోయిన వారంతా బీజీపూర్, సుక్మా జిల్లాకు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు.

ఈ సదర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుతో పాటు 81, 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు. గడిచిన 5 నెలల కాలంలో మావోయస్టు పార్టీలోని 282 మంది వివిధ హోదాల్లో పని చేస్తున్న వారు సరెండర్ అయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సాయిధ దళాల సంచారం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే ఉందని తెలిపారు. సరిహద్దు గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు దళాలకు సహకరించకూడదని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల సమాచారం తెలిసినట్లయితే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

చికిత్స కంటే నివారణే మేలు..

లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ తగిన రివార్డును ఇస్తుందని, చికిత్స కంటే నివారణే మేలని అన్నారు. మావోయిస్టు అజ్ఞాత సాయిధ దళాలు తెలంగాణ ప్రాంతంలో సంచరిస్తే ఏ ఒక్క దళ సభ్యుడు కూడా పోలీసు శాఖ తీసుకునే చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో, కర్రే‌గుట్టతో పాటు జరిగిన ఎదురు‌కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు తమ ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. అజ్ఞాత దళ సభ్యులు వారికి సహకరించే మిలిషియా సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఎస్పీ రోహిత్ రాజు పిలపునిచ్చారు.

Next Story