- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Kagar : ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది : అమిత్ షా ప్రకటన
ఆపరేషన్ కగార్(Operation Kagar) ఆపేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) బుధవారం కీలక ప్రకటన జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆపరేషన్ కగార్(Operation Kagar) ఆపేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Sha) బుధవారం కీలక ప్రకటన జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), తెలంగాణ(Telangana) సరిహద్దుల్లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇటీవల కర్రెగుట్టల సెర్చ్ ఆపరేషన్(Karreguttala Search Operation) లో మొత్తం 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు పేర్కొన్నారు. 2024 జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్.. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో నడుస్తోందని వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, గడ్చిరోలి (మహారాష్ట్ర), వెస్ట్ సింఘ్భూమ్ (ఝార్ఖండ్) ప్రాంతాల్లో లక్ష మంది సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, రాష్ట్ర పోలీసులతో కూడిన బలగాలు డ్రోన్లు, శాటిలైట్ ఇమేజరీ, ఏఐ సాంకేతికతలతో మావోయిస్టులను ఏరి పారేస్తున్నట్టు తెలిపారు.
ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ లో 450 మంది వరకు మావోయిస్టులు హతం కాగా.. 7,500 మంది లొంగిపోయినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత మే 10, 2025న కర్రెగుట్టలో తాత్కాలికంగా ఈ ఆపరేషన్ కు బ్రేక్ పడినప్పటికీ, ఇకపై కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ ఆపరేషన్ ఆదివాసీల భూములను కార్పొరేట్‌లకు అప్పగించే ఉద్దేశంతో జరుగుతోందని విమర్శలు వస్తున్నప్పటికీ.. ఇది జాతీయ భద్రత, అభివృద్ధికి కీలకమని అమిత్ షా పేర్కొన్నారు.






