- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ కగార్ ప్రభావం.. లొంగిపోయిన 13 మంది మావోయిస్టులు
కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కగార్ (Operation Kagar)' మావోయిస్టులపై ప్రభావవంతంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కగార్ (Operation Kagar)' మావోయిస్టులపై ప్రభావవంతంగా కొనసాగుతోంది. ఈ ప్రత్యేక ఆపరేషన్ కారణంగా మావోయిస్టుల శక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రధానంగా అడవుల్లో మావోయిస్టుల శిబిరాలు ధ్వంసమవుతుండటంతో పాటు, వారి సంచార మార్గాలు, నిధుల సమీకరణ వ్యవస్థలు పూర్తిగా డిస్ట్రబ్ అయ్యాయి. ఈ క్రమంలో మావోయిస్టు శ్రేణుల్లో అనిశ్చితి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలువురు మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur ) జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉండటం విశేషం. వీరిలో కొంతమంది గతంలో బహుళ మావోయిస్టు దాడుల్లో భాగంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై మొత్తం రూ.23 లక్షల రివార్డులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. అంతేగాక, ఈ కార్యక్రమంలో వారికి విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు భద్రతా అధికారులు పేర్కొన్నారు.






