Moscow: రష్యాలో భారత దౌత్య బృందానికి భయానక అనుభవం

by Shamantha N |

పాక్ ఉగ్రకుట్రలపై ప్రపంచదేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. కాగా.. ఈ బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాయి.

Moscow: రష్యాలో భారత దౌత్య బృందానికి భయానక అనుభవం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఉగ్రకుట్రలపై ప్రపంచదేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. కాగా.. ఈ బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాయి. కాగా.. అలా విదేశీ పర్యటనకు వెళ్లిన ఓ బృందానికి భయానక అనుభవం ఎదురైంది. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి (DMK MP Kanimozhi) నేతృత్వంలోని దౌత్య బృందం రష్యాకు పయనమైంది. అయితే, వీరు ల్యాండ్‌ అయ్యే సమయానికి మాస్కో (Moscow)లో డ్రోన్‌ దాడి (drone attack) జరిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి కారణంగా మాస్కోలో దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే మాస్కో ఎయిర్ పోర్టు ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో భారత దౌత్య బృందం విమానం ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ అంతరాయం కారణంగా విమానం చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. కాగా.. కనిమొళి నేతృత్వంలోని భారత దౌత్య బృందం విమానం గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. గంటల తరబడి అలా గాల్లోనే ఉన్న విమానం చివరికి సురక్షితంగా మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు విమానాశ్రయంలో అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని స్వాగతించి.. వారిని సురక్షితంగా వారి హోటల్‌కు తీసుకెళ్లారు.

విదేశాలకు..

కాగా సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్‌ తీరును ప్రపంచ దేశాల ముందు ఎండగట్టడానికి ఏడు బృందాలను ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్‌ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్థాన్‌ ప్రాయోజిక తీవ్రవాదం, ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)పై వివిధ దేశాలకు వివరించడానికి పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఇప్పటికే ఆయా దేశాలకు వెళ్లాయి.

Next Story