PM Modi: పాస్ అవుతారని గ్యారెంటీ ఉన్నవారికే ఆ ఛాన్స్- ఆప్ పై మోడీ విమర్శలు

by Shamantha N |

మరో రెండ్రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. చివరి రోజున జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) కొంతమంది ఢిల్లీ విద్యార్థులతో ముచ్చటించారు.

PM Modi: పాస్ అవుతారని గ్యారెంటీ ఉన్నవారికే ఆ ఛాన్స్- ఆప్ పై మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మరో రెండ్రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. చివరి రోజున జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) కొంతమంది ఢిల్లీ విద్యార్థులతో ముచ్చటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆప్ గర్వకారణంగా ప్రచారం చేసే విద్యా విధానంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఢిల్లీ పాఠశాలల్లో 9వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను ఆమ్‌ ఆద్మీ పార్టీ అనుమతించడం లేదని విన్నాను. కేవలం పాస్‌ అవుతారని గ్యారెంటీ ఉన్నవారిని పదో తరగతికి ప్రమోట్ చేస్తున్నారట. రిజల్ట్‌ సరిగా రాకపోతే.. ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారు. ఇలా విద్యా వ్యవస్థలోనూ ఆప్ అవినీతికి పాల్పడుతున్నారు’’ అని విద్యార్థులతో ప్రధాని అన్నారు. ఆప్‌ ప్రతిష్ఠను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మోడీ నిప్పులు చెరిగారు.

గతంలో ఆరోపణలు

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 9, 11వ తరగతుల్లో ఫెయిలయ్యే వారి సంఖ్య అధికంగా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా లక్ష మందికి పైగా 9వ తరగతిలో ఫెయిల్‌ అవుతున్నారని గతంలో కొన్ని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీకి(Assembly Elections) ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Next Story