- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి: పంజాబ్ సీఎం
ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇటీవల 8 రోజుల పాటు ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇటీవల 8 రోజుల పాటు ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు మోడీపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann) కూడా ప్రధాని పర్యటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఘనా అని ఎక్కడికో వెళ్లారు.. ఆయన ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలంటూ విమర్శించారు. అలాగే, 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఉండకుడా.. 10 వేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయని మాన్ పేర్కొన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ మండిపడింది. ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మాన్ పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవని మండిపడింది. భారత్‌తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని పేర్కొంది.






