- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్సీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చేసిన ఏకైక ఆప్ ఎమ్మెల్యే
ఎన్సీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చేసిన ఏకైక ఆప్ ఎమ్మెల్యే. ప్రజాసంక్షేమం కోసమే అంటూ ట్వీట్.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని ఏకైకా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే.. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. గతేడాది జరిగిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆప్‌కు చెందిన మెహరాజ్ మాలిక్.. దొడ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గజయ్ సింగ్ రాణాను 4,538 ఓట్ల తేడాతో విజయం సాధించి, జమ్మూకశ్మీర్‌లో ఏకైకా ఆప్ ఎమ్మెల్యేగా నిలిచారు.
‘దొడ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ అనే నేను.. ప్రభుత్వ కూటమిలో ఎన్సీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నాను. జమ్మూకశ్మీర్ ప్రజల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ప్రజల నమ్మకం, సంక్షేమమే నాకు ముఖ్యం’ అని సోషల్ మీడియా వేదికగా మాలిక్ ప్రకటించారు. అయితే 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఆప్ పాత్ర ఏం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్సీ వద్ద 42 సీట్లు ఉండగా.. 6 సీట్లున్న కాంగ్రెస్ కూడా ఈ పార్టీకి మద్దతిస్తోంది. ఇవికాక స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్సీకి సపోర్ట్ ఇస్తు్న్నారు.






