- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు కన్నీరు తెప్పిస్తోన్న ఉల్లి.. భారీగా పతనమైన ధరలు
దేశంలో ఉల్లి ధరలు ఊహించని స్థాయిలో పతనమవ్వడంతో ఉల్లిరైతులు కన్నీరు పెడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉల్లి ధరలు ఊహించని స్థాయిలో పతనమవ్వడంతో ఉల్లిరైతులు కన్నీరు పెడుతున్నారు. వేలు, లక్షల రూపాయల పెట్టుబడితో ఉల్లిని సాగు చేస్తే.. తీరా పంట చేతికి వచ్చే సమయానికి ధర భారీగా పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉల్లి, వెల్లుల్లికి కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని మాల్వా ప్రాంతంలో పాత, కొత్త ఉల్లిపాయల నిల్వలు ఒకేసారి మార్కెట్ కు అమ్మకానికి రావడంతో.. ఉల్లి ధర అమాంతం పడిపోయింది. 6 నెలలుగా ఉల్లి ఉత్పత్తులను నిల్వ చేసినా.. మద్దతు ధర రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
రత్లాం వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్లో ఉల్లి ధర సగటున క్వింటాలుకు కేవలం రూ.600గా నమోదవ్వగా.. కనీస మద్దతు ధర రూ.200కు పతనమైంది. దీని ప్రకారం కిలో ఉల్లి ధర మంగళవారం (నవంబర్ 11) రూ.2 - రూ.6 మధ్య ఉన్నాయి. ఈ ధర బుధవారానికి రూ.1కి పడిపోవడంతో రైతులు ఉల్లిపంటను అమ్మడం కంటే పడేయటం మేలంటున్నారు. కనీస మద్దతు ధర ఇవ్వాలని లేదంటే.. ఆత్మహత్యే శరణ్యమంటూ రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఓ రైతు 30 క్వింటాళ్ల ఉల్లిపాయలను మార్కెట్కు ఒక ట్రాక్టర్ లో తరలించగా దానికి రూ.2000 చెల్లించానని, ఫలితంగా తనకు ఒక క్వింటా ఉల్లికి రూ.250 చొప్పున రూ.7500 మాత్రమే వచ్చాయని వాపోయాడు. తాను పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదన్నాడు. కానీ.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రిటైల్ మార్కెట్లో కిలోఉల్లి రూ.15 వరకూ ఉండగా.. హోల్ సేల్ మార్కెట్లలో రూ.10 గా ఉంది.






