కార్గో షిప్‌లో కొనసాగుతున్న పేలుళ్లు, మంటలు

by Malleboina Mahesh |   (  Updated:2025-06-10 17:35:38  IST  )

కేరళ తీరంలో కార్గో షిప్‌ లో రెండో రోజు కూడా మంటలు, పేలుళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. సింగపూర్ నుంచి వచ్చిన కంటైనర్ నౌక‌లో మంటలు ఉహించని విధంగా మంటలు చెలరేగాయి.

కార్గో షిప్‌లో కొనసాగుతున్న పేలుళ్లు, మంటలు
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ తీరంలో కార్గో షిప్‌ (Cargo ship)లో రెండో రోజు కూడా మంటలు, పేలుళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. సింగపూర్ నుంచి వచ్చిన కంటైనర్ నౌక (container ship)లో మంటలు ఉహించని విధంగా మంటలు చెలరేగాయి. అయితే ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది (Rescue personnel) మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికి కంటైనర్లలో ఉన్న వివిధ కెమికల్ పదార్థాల కారణంగా పేలుళ్లు కొనసాగుతున్నాయి. దీంతో నాలుగు రెస్క్యూ బోట్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. మంటలు అదుపులోకి రావడం లేదు.

కాగా మిడ్-షిప్ ప్రాంతం- వసతి బ్లాక్‌కు ముందున్న కంటైనర్ బే నుంచి మంటలు చెలరేగుతున్నట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు (Indian Coast Guard officers) మంగళవారం తెలిపారు. కాగా ఈ ఘటనపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంటలను వ్యాపించకుండా నిరోధించడానికి భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు సముద్ర ప్రహరి, సాచెట్ సముద్రంలో అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో షిప్‌లో దట్టమైన పొగ వ్యాప్తి చెందడం కిలోమీటర్ల మేర కనిపించడం వైరల్‌గా మారింది. కాగా ఈ ప్రమాదంలో మొత్తం 18 మందిని కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది కాపాడి సురక్షితంగా తరలించారు.

Next Story