‘ఆపరేషన్ సిందూర్‌’కు నేటితో ఏడాది.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెన్సేషనల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-07 03:28:20  IST  )

ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత వైమానిక దళం సాయుధ దళాల పరాక్రమానికి నివాళులర్పించారు.

‘ఆపరేషన్ సిందూర్‌’కు నేటితో ఏడాది.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్‌కు కౌంటర్‌గా, సరిహద్దులో టెర్రరిస్టల ఏరివేత లక్ష్యంగా చేపట్టి ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ (Operation Sindoor)కు నేటితో ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) భారత వైమానిక దళం, సాయుధ దళాల అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు. ‘ఆపరేషన్ సిందూర్’ భారతదేశ జాతీయ సంకల్పం, సంసిద్ధతకు శక్తివంతమైన చిహ్నగా అభివర్ణించారు. దేశ సరిహద్దులను రక్షించడంలో మన సాయుధ దళాలు ప్రదర్శించిన అసమానమైన పరాక్రమానికి ఈరోజుకూ నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు భారత వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న వీరుల త్యాగాలను, వృత్తిపరమైన నైపుణ్యాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించింది.

Next Story