- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్‌కత్తా హత్యాచార ఘటనకు ఏడాది పూర్తి.. నబన్నా అభిమాన్ పేరుతో ర్యాలీ.. తీవ్ర ఉద్రిక్తత
నబన్నా అభియాన్ పేరుతో వివిధ విద్యార్థి సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఘటనపై న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో (Kolkata Rjikar Medical College) జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా శనివారం నబన్నా అభియాన్ పేరుతో వివిధ విద్యార్థి సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఘటనపై న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో వైద్యురాలి తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. అయితే, ఆందోళనకారులు ర్యాలీలో భాగంగా ఆంక్షల ప్రదేశంలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), వాటర్ క్యానన్‌లు, డ్రోన్‌లు ఉపయోగించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నబన్నా చుట్టూ సెక్షన్ 163 కింది నిషేధాజ్ఞాలు అమలు చేశారు. హౌరా బ్రిడ్జ్, విద్యాసాగర్ సేతు, హూగ్లీ నదిపై ఉన్న ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్‌తో నిలిచిపోయింది.
శాంతియుతంగా నిరసన చేపట్టిన తమపై పోలీసులు దాడి చేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు తమను ర్యాలీ పాల్గొనకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. న్యాయం కావాలని అడిగినందుకు తమ రక్తం కళ్ల చూశారని ఆరోపించారు.
కాగా, కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో గతేడాది ఆగస్టు 9న రాత్రి సెమినార్ రూమ్‌లో 31 ఏళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సీబీఐ ఈ కేసును విచారించి, మాజీ సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను నిందితుడిగా తేల్చింది. దీంతో సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించి, ఈ ఏడాది జనవరిలో జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే, ఈ హత్యాచారం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఒక్కరే ఈ నేరం చేయలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.






