అక్కడ ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్‌ఐవీ.. స్కూల్ బాలికలను వదల్లేదు!

by Prasad Jukanti |

ప్రపంచంలోనే ప్రత్యేకమైన నృత్యం కలిగి ఉన్నామని సంతోషించేలోపు అక్కడి ప్రజలకు అదే నృత్యం ఓ శాపంగా మారిపోయింది.

అక్కడ ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్‌ఐవీ.. స్కూల్ బాలికలను వదల్లేదు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వైపు వైద్య రంగంలో ప్రపంచం వేగంగా దూసుకు వెళ్తుంటే మరో వైపు చిన్న దేశాలు, నిరుపేద దేశాలు వ్యాధుల కూపంలోకి అంతే వేగంగా కుశించుకుపోతున్నాయి. దక్షిణ ఆఫ్రికాలోని అతి చిన్న దేశం ఎస్వతిని (పాత పేరు స్వాజిలాండ్)లో విజృంభిస్తున్న హెచ్ఐవీ ఇందుకు తాజా నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాలు, విలక్షణమైన సంప్రదాయాలకు పెట్టింది పేరుగా నిలిచే ఈ దేశంలో ఇప్పుడు హెచ్ఐవీ పెద్ద ఎత్తున వ్యాప్తిచ చెందడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఈ దేశం మొత్తం జనాభా 12 లక్షలు అయితే వీరిలో దాదాపు 3 లక్షల మంది హెచ్ఐవీ బారిన పడ్డవారే ఉన్నారు. అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఈ మహమ్మారి బారితో బాధపడుతున్నవారే.

కొంప ముంచుతున్న రీడ్ డ్యాన్స్:

ఇక్కడ ఏటా దాదాపు 7 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతుండగా 15-49 ఏళ్ల మధ్య హెచ్ఐవీ బారిన పడుతున్న దేశాల్లో ఎస్వతిని వరల్డ్ లోనే టాప్‍లో ఉంది. అయితే ఈ దుస్థితికి అనేక కారణాలు ఉన్నప్పటికీ పేదరికం ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ దేశ జనాభాలో దాదాపు 60 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్న వారే. దీంతో వీరంతో పొరుగున ఉన్న దక్షిణాఫ్రికా గనుల్లో కూలీ పనుల నిమిత్తం వెళ్తుంటారు. అక్కడ గనుల యజమానులు ఈ దేశ మహిళలతో శృంగార వాంఛలు తీర్చుకుంటారు. అలాగే ఎస్వతిని సంప్రదాయ నృత్యం రీడ్ డ్యాన్స్ చాలా ప్రత్యేకమైనది. ఈ నృత్యాన్ని వీక్షించేందుకు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకు వస్తుంటారు. ఆ సమయంలో నిరుపేద మహిళలు డబ్బు కోసం ఆ పర్యాటకులతో శృంగారంలో పాల్గొంటుంటారు. ఈ క్రమంలో సరైన సురక్షి పద్ధతులు పాటించకపోవడంతో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్న ట్లు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.

స్కూల్‌ వయస్సులోనే లైంగిక సంబంధాలు:

పెద్దల పరిస్థితి ఇలా ఉంటే పాఠశాలకు వెళ్లే పిల్లలను లైంగిక సంబంధాల వైపు ప్రోత్సహించడం మరో కారణం అని చెబుతున్నారు. దాదాపు 18 శాతం మంది తమ స్కూల్ వయసులోనే తొలిసారి శృంగారంలో పాల్గొన్నామని చెబుతుండగా ఇక్కడ బహుభార్యత్వం సర్వసాధారణం. ఈ దేశ రాజే రీడ్ నృత్యం సందర్భంగా ఏటా ఓ యువతిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవడం ఇక్కడ మరో ఆనవాయితీ. ఇలా 1986లో తొలిసారి వెలుగు చూసిన హెచ్ఐవీ కేసు విచ్చలవిడిగా పెరిగిపోయింది. పేదరికం, మందుల కొరతతో ఈ వ్యాధి వ్యాప్తి తీవ్రతరం అవుతున్నా.. ఇటీవల హెచ్‌ఐవీ నిర్మూలన కోసం పనిచేస్తున్న గ్లోబల్‌ ఫండ్‌ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు ఇటీవల మరణాలు తగ్గేలా చేసిందని స్థానిక అధికారులు చెబుతున్నారు.

Next Story