అమెరికా అగ్ని ప్రమాద ఘటన.. మరో తెలుగు వ్యక్తి మృతి

by Muthe.Rajitha |

అమెరికా అగ్ని ప్రమాద ఘటనలో మరో తెలుగు వ్యక్తి మృతి చెందాడు.

అమెరికా అగ్ని ప్రమాద ఘటన.. మరో తెలుగు వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అగ్ని ప్రమాద ఘటనలో మరో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. న్యూయార్క్‌ లోని అల్బనీ ప్రాంతంలో డిసెంబర్‌ 4న జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులు మరణించగా.. అన్వేష్‌ అనే మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి పక్క భవనాలకు వ్యాపించడంతో అక్కడ నివసిస్తున్న తెలుగు విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, గాయపడిన అన్వేష్‌ను కాపాడలేకపోయారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని, ఈ కఠిన సమయంలో వారితో ఉన్నామని భారత్‌ అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.

Next Story