- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ఢీకొని ఒక ఏనుగు మృతి, మరో ఏనుగుకి తీవ్ర గాయాలు
అడవి ఏనుగులు రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.

దిశ, వెబ్ డెస్క్: అడవి ఏనుగులు రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని జల్పాయిగురి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు (Forest officials) హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఒక ఏనుగు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏనుగు తీవ్ర గాయాలతో అక్కడే పడిపోయింది. అనంతరం గాయపడిన ఏనుగుకు చికిత్స అందించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతం ఏనుగుల కదలికకు (Elephant Corridor) కేంద్రంగా ఉన్నప్పటికీ, రైల్వే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పర్యావరణ కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో రైలు ఢీకొని ఏనుగులు మరణించడం పెరిగింది. ఇది అడవులు, రైల్వే మార్గాల మధ్య పెరుగుతున్న ఘర్షణకు సంకేతం గా నిలుస్తుందని. ఆహారం కోసం అడవిని దాటి ఏనుగులు తరచుగా రైలు పట్టాలపైకి వస్తున్నాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి రైల్వే మార్గాలలో వేగ పరిమితిని కఠినంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఏనుగులు తిరిగే ప్రాంతాలను గుర్తించి, రైలు డ్రైవర్లను అప్రమత్తం చేసే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు రైల్వే బోర్డును డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
- Tags
- elephant






