- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యాటకులకు బంపరాఫర్.. అక్కడ ఫ్లైట్ జర్నీ ఫ్రీ
పర్యాటకులను తమ దేశాల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంటాయి కొన్ని ప్రపంచ దేశాలు.

దిశ, వెబ్‌డెస్క్: పర్యాటకులను తమ దేశాల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంటాయి కొన్ని ప్రపంచ దేశాలు. అలాంటి వాటిలో థాయ్‌లాండ్ (Thailand) ఒకటి. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. అక్కడున్న పర్యాటక ప్రదేశాలకు ప్రపంచ పర్యాటకుల్ని రప్పించేలా కొత్తగా ఒక ట్రావెల్ స్కీమ్ ను తీసుకురానుంది. ఆ స్కీమ్‌లో భాగంగా థాయ్ లాండ్ లో ఫ్లైట్ జర్నీని ఫ్రీగా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్యాంకాక్, పుకెట్ లాంటి ప్రదేశాలు మాత్రమే కాకుండా.. ఇతర పర్యాటక ప్రాంతాలకు కూడా విదేశీ పర్యాటకులు ఎక్కువగా వెళ్లేందుకు.. "బై ఇంటర్నేషనల్, ఫ్రీ థాయ్‌లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్" పేరుతో ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.
ఈ ప్లాన్ కింద అక్కడ ఫ్లైట్స్‌లో ప్రయాణించే విదేశీ పర్యాటకులకు వన్ వే టికెట్ ప్రైస్ 1750 బాత్స్ (రూ.4691.౦౩), రౌండ్ ట్రిప్స్ కు 3500 బాత్స్ (రూ.9382.06)ను ప్రభుత్వమే చెల్లించే యోచనలో ఉంది. అంతా ఓకే అయితే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య నెలల్లోనే ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు థాయ్ మీడియా పేర్కొంది. థాయ్ లాండ్ పర్యాటనకు వెళ్లేవారు.. ఎయిర్ లైన్ వెబ్ సైట్స్, ఫ్లై త్రూ సర్వీసెస్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్స్, మల్టీ సిటీ ఆప్షన్స్ ద్వారా ఈ ఆఫర్ ను పొందవచ్చు.






