- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీలంబూర్ బైపోల్ ప్రచారంపై కాంగ్రెస్ vs శశిథరూర్.. ఆయనే రాలేదంటూ..!
నీలంబూర్ బైపోల్ ప్రచారంపై కాంగ్రెస్ vs శశిథరూర్ దుమారం రేగుతోంది. లిస్టులో పేరున్నా ఆయనే రాలేదని కాంగ్రెస్ అంటోంది.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి, సీనియర్ నేత శశిథరూర్‌కు మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల కేరళలోని నీలంబూర్‌లో ఉపఎన్నిక కోసం నిర్వహించిన ప్రచారంలో థరూర్ పాల్గొనలేదు. ప్రచారం చేయడానికి తనను కాంగ్రెస్ పిలవలేదని, అయినా తనేం బాధపడటం లేదని కొన్నిరోజుల క్రితం థరూర్ వెల్లడించారు. తను ఈ ఎన్నికల ప్రచారం సమయంలో దౌత్యబృందంతో కలిసి విదేశాల్లో ఉన్నానని చెప్పిన ఆయన.. పార్టీ అధిష్టానంతో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే కూర్చొని చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. తను స్వదేశానికి తిరగొచ్చిన తర్వాత కూడా పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎలాంటి ఫోన్ రాలేదని వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలపై కేరళ కాంగ్రెస్ చీఫ్ సన్నీ జోసెఫ్ స్పందించారు. నీలంబూర్ బైపోల్‌లో స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో శశిథరూర్ పేరు కూడా ఉందని ఆయన స్పష్టంచేశారు. ‘మేం ఈ లిస్టును అధికారికంగా ప్రచురించి ఎన్నికల కమిషన్‌కు అందజేశా. దీంట్లో శశిథరూర్ పేరు కూడా ఉంది. ఈ టైంలో ఆయన విదేశాల్లోనే ఎక్కువ గడిపారు. ఆ తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కేరళకు వచ్చింది కూడా నాకు తెలీదు. ఒక్క ఏకే ఆంటొనీ తప్ప మిగతా అందరు నేతలంతా సమన్వయం చేసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు’ అని జోసెఫ్ తేల్చిచెప్పారు. రమేష్ చెన్నితల, కొడికున్నిల్ సురేష్ వంటి సీనియర్ నేతలు కూడా ప్రచారం చేశారని గుర్తుచేసిన ఆయన.. థరూర్‌పై పరోక్షంగా అసహనం వ్యక్తంచేశారు. కాగా, దౌత్యబృందంతో కలిసి విదేశాల్లో పర్యటించిన శశిథరూర్.. ఆ సమయంలో ప్రధాని మోడీని, ఆపరేషన్ సిందూర్‌ను మెచ్చుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడపడని సంగతి తెలిసిందే. అంతకుముందు యూపీఏ సర్కారులో కూడా ఇలాంటి ఆపరేషన్లు చేశామని, కానీ థరూర్ వాటిని ప్రస్తావించలేదని కాంగ్రెస్ వర్గాలు మండిపడ్డాయి. అప్పటి నుంచే పార్టీకి, థరూర్‌కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది.






