- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Donald Trump: మరోసారి ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. ఆ నిర్ణయాన్ని నిలిపివేసిన కోర్టు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు (mass firings by US agencies) విషయంలో మాత్రం ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ (District Judge William Alsup) ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్పు వెల్లడించారు.
అమెరికా (USA) ప్రభుత్వానికి చెందిన పలు ఫెడరల్ ఏజెన్సీల్లో దాదాపు 2 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలా మందిని విధుల నుంచి తొలగించాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ నిర్ణయించింది. దీన్ని అధ్యక్షుడు ట్రంప్ కూడా సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలో అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలను సవాల్ చేస్తూ పలు కార్మిక యూనియన్లు, న్యాయవాద సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై తాజాగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాగా, అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ డోజ్ శాఖకు సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్చి 13లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని అందులో పేర్కొన్నారు. వీటి ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇది వరకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
ఇక, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడు నిర్ణయాలకు కోర్టులు అడ్డుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను కోర్టు నిలిపివేసింది. ఆ తర్వాత శరణార్థులకు సంబంధించి తీసుకున్న నిర్ణయానికి వెస్ట్ కోస్ట్‌లోని మరో న్యాయమూర్తి అడ్డుకట్ట వేశారు.






