Onam: స్కూల్లో ఘనంగా ఓనం పండుగ (వీడియో)

by Disha Web Desk 7 |
Onam: స్కూల్లో ఘనంగా ఓనం పండుగ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఓనం పండుగను హిందూ సాంప్రదాయంతో ఘనంగా జరుపుకుంటారు. దాదాపుగా 9 నుంచి 10 రోజుల పాటు వివిధ దేవతలను పూజిస్తారు. అక్కడి మహిళలు సంస్కృతి ఉట్టి పడేలా చీరలు ధరించి, కట్టుబొట్టులతో ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే కేరళ జిల్లాలోని వండూర్ ప్రాంతంలోని ఒక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఓనం పండుగను ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓనం వేడుకల్లో భాగంగా.. వండూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు హిజాబ్ ధరించి, చక్కగా చీరలు కట్టుకుని.. ఇతర విద్యార్థులు, టీజర్స్‌తో కలిసి డాన్స్‌లు చేశారు. ఈ వీడియోలో కనిపించే దృశ్యాలే ప్రస్తుతం వైరల్‌గా మారాయి.



Next Story

Most Viewed