‘ఆడపిల్ల పుడితే రూ.2000’.. ఔరా అనిపిస్తోన్న యువ దంపతుల వినూత్న ఆలోచన..!

by Disha Web Desk 19 |
‘ఆడపిల్ల పుడితే రూ.2000’.. ఔరా అనిపిస్తోన్న యువ దంపతుల వినూత్న ఆలోచన..!
X

దిశ, తాడ్వాయి: చేతిలో డబ్బులు ఉంటే చాలు వాటిని ఎలా దుబారా ఖర్చు చెయ్యాలని ఆలోచిస్తాం. అలాంటిది ఓ యువ దంపతులు ఆ గ్రామంలో జన్మించిన ప్రతి ఆడపిల్లకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి డబ్బులు పొదుపు చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలో తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామానికి చెందిన రెడ్డిగారి తిరుపతి రెడ్డి, రెడ్డిగారి శ్రావణ లక్ష్మి దంపతులు 10వ వివాహ వార్షికోత్సవ వేడుకలను అందరిలా కాకుండా వినూత్నంగా సెలబ్రెట్ చేసుకోవాలని ఆలోచించారు.

ఇందులో భాగంగా వారు పుట్టి పెరిగిన ఏండ్రియల్ గ్రామంలో ఈ జనవరి మాసం నుంచి జన్మించిన ప్రతి ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి రూ.2000 వారి పేరునా డిపాజిట్ చేసి ఆదర్శంగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే వారు ఈ సమాజంలో ఉన్నందు వల్లే ఇలాంటి ఆలోచన చేశామని తెలిపారు. ఆడపిల్ల ఉన్నత చదువులకు పెళ్లిళ్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా పుట్టినప్పటి నుండే సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి పొదుపు చేయాలనే లక్ష్యంతో తల్లి తండ్రులకు అవగాహన కల్పించడానికి ఈ చిరు ప్రయత్నం చేసినట్లు వారు వెల్లడించారు.

Next Story