- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Omar : బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar abdhullah) స్పష్టం చేశారు. ప్రస్తుతం అలాంటి ప్రణాళికలేమీ లేవని తేల్చి చెప్పారు. కశ్మీర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్సీ సొంత రాజకీయ దృక్పదానికే కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ‘బీజేపీతో ఎలాంటి పొత్తూ లేదు. అది అవసరం కూడా లేదు. తమ పార్టీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. జమ్మూ కశ్మీర్ విషయంలో. భాగస్వామ్యం కోసం ఎటువంటి అవకాశం లేదు’ అని తెలిపారు. కశ్మీర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేర్చుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆర్ఎస్ పఠానియా (Rs patania) జమ్మూ కశ్మీర్‌లో పొత్తులపై మాట్లాడారు. ఎన్సీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా క్లారిటీ ఇచ్చారు.
అనంతరం అసెంబ్లీలో మాట్లాడిన ఒమర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan singh) పై ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (Musharraf), మన్మోహన్ కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో గణనీయమైన పురోగతి సాధించారని కొనియాడారు. ‘మన్మోహన్ హయాంలో వర్కింగ్ గ్రూపులు ఏర్పడ్డాయి. కశ్మీరీ పండిట్లకు ఉద్యోగాలు సృష్టించారు. జగ్తి టౌన్‌షిప్ ఆయన కాలంలోనే ఏర్పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని సైతం ప్రారంభించారు’ అని తెలిపారు. బనిహాల్‌కు రైలును ప్రారంభించే ప్రధాని కోసం మేము ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.






