Om Birla vs Rahul Gandhi: ‘నేను ఆర్టిస్ట్‌ని సార్, మజా తీసుకోండి’.. లోక్‌సభలో వాడివేడి చర్చ

by Ramesh Naini |

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల సవరణ, డీలిమిటేషన్ బిల్లులపై శుక్రవారం చర్చ వాడివేడిగా సాగింది.

Om Birla vs Rahul Gandhi: ‘నేను ఆర్టిస్ట్‌ని సార్, మజా తీసుకోండి’.. లోక్‌సభలో వాడివేడి చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల సవరణ, డీలిమిటేషన్ బిల్లులపై శుక్రవారం చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన సంభాషణ సభలో ఆసక్తి రేకెత్తించింది. లోక్‌సభలో బిల్లుపై తన ప్రసంగాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. విషయానికి ముడిపెడుతూ తన చిన్ననాటి కథలను ప్రస్తావించడం మొదలుపెట్టారు. ‘మిమ్మల్ని మళ్లీ నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాను’ అని రాహుల్ అనగానే స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. ‘దయచేసి మ్యాజిక్ కథలు ఆపి, బిల్లుపై మాట్లాడండి’ అని సూచించారు. దీనికి బదులిచ్చిన రాహుల్.. ‘సార్, నేను చిత్రాలు గీస్తాను. నేను ఒక ఆర్టిస్ట్‌ని.. మీరు మజా తీసుకోండి, చివర్లో అంతా సబ్జెక్టుకు సరిగ్గా సరిపోతుంది’ అని బదులిచ్చారు.

ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత తీవ్ర విమర్శలు

ఈ బిల్లులపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్, అసోం తరహాలోనే దేశ రాజకీయ ముఖచిత్రాన్ని (Rejig) మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇందులో దళితులు, ఓబీసీలకు చోటు కల్పించడం లేదని ఆరోపించారు. ఈ బిల్లుల వెనుక ఉన్న ప్రమాదాన్ని పసిగట్టే ఇందిరా గాంధీ, వాజ్‌పేయి డీలిమిటేషన్‌కు అనుమతించలేదన్నారు. ఇది ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని తెలిసి కూడా బీజేపీ భయంతో తీసుకుంటున్న చర్య (Panic reaction) అని విమర్శించారు. ఎలక్టోరల్ మ్యాప్‌ను మార్చడం, తాను మహిళా పక్షపాతినని చెప్పుకోవడం కోసమే ప్రధాని మోదీ ఈ ప్రయత్నం చేస్తున్నారని, గురువారం ప్రధాని ప్రసంగంలో ఉత్సాహం లోపించిందని (Low energy) అన్నారు. ‘బీజేపీ వాళ్లే భారతదేశ ప్రజలమని, సాయుధ బలగాలని అనుకుంటారు.. వారి వెనుక దాగడం మానాలి’ అని విమర్శించిన రాహుల్.. ఈ బిల్లును ప్రతిపక్షం ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ‘ఈ చిక్కుముడికి మొత్తం జవాబు ‘16’ అనే సంఖ్యలోనే దాగి ఉంది’ అని ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

Next Story