తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారానికి ఓం బిర్లా

by Phanindra |

తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారానికి ఓం బిర్లా. ప్రధాని మోడీ స్థానంలో వెళ్లనున్న స్పీకర్.

తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారానికి ఓం బిర్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ ఈ నెల 17వ తేదీన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీఎన్‌పీ చీఫ్ తారిఖ్ రెహ్మాన్ కూడా అదే రోజున ఆ దేశ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం అందింది. అయితే అదే సమయంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక భేటీ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కేంద్ర ప్రభుత్వం పంపుతోంది. తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారంలో భారత్‌కు ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. పాక్ పీఎం షెహబాజ షరీఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఈ ప్రమాణ స్వీకారానికి రావాలని భారత్, చైనా, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఖతార్, మలేసియా, బ్రూనే, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, భూటాన్ దేశ ప్రభుత్వాలకు బంగ్లాలోని మధ్యంతర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.

Next Story