Om Birla: పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ఫన్నీ ఇంటర్వ్యూ.. స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautham Adani)పై వచ్చిన ముడుపుల ఆరోపణలపై జేపీసీ విచారణ జరిపించాలని కోరుతూ.. పార్లమెంట్‌ (Parliament)లో విపక్షాలు పట్టుబట్టాయి.

Om Birla: పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ఫన్నీ ఇంటర్వ్యూ.. స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautham Adani)పై వచ్చిన ముడుపుల ఆరోపణలపై జేపీసీ విచారణ జరిపించాలని కోరుతూ.. పార్లమెంట్‌ (Parliament)లో విపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో సహా ప్రతిపక్ష నేతలంతా అదానీ (Adani), ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) కార్టూన్లతో కూడిన హ్యాండ్ బ్యాగులను భుజానికి వేసుకుని నిరసన తెలిపారు. అయితే, ఆ బ్యాగులపై మోడీ, అదానీ భాయ్ భాయ్ అనే స్లోగన్ రాసి ఉంది.

అదేవిధంగా సోమవారం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), గౌతమ్ అదానీ (Gautham Adani) ముసుగులు ధరించిన ఇద్దరు ఎంపీలతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫన్నీ ఇంటర్వ్యూ నిర్వహించడం పట్ల స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ వేదికగా రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఓ పవిత్రమైన ప్రదేశమని అన్నారు. సభా మర్యాదలను కాపాడేలా సభ్యులు వ్యహరించాలంటూ కామెంట్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష నేతగా అమర్యాదగా ప్రవర్తించడం భాదకరమని అన్నారు. అధికార పక్షమైనా.. విపక్షమైనా సభ మర్యాదలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం ఏ అంశమైనా చర్చించవచ్చని ఓ బిర్లా సీరియస్ అయ్యారు.

Next Story