భార్య‌ను బ‌తికించుకునేందుకు 600కిమీ రిక్షా తొక్కిన వృద్ధుడు

by Ajay Maddhiboyina |

భార్య‌ను బ‌తికించుకునేందుకు ఓ 70ఏళ్ల వ్య‌క్తి 600కిమీ వ‌ర‌కు రిక్షా తొక్కాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని సంబ‌ల్పూర్ కు చెందిన బాబు లోహ‌ర్ అనే వ్య‌క్తి భార్య అనారోగ్యానికి గురైంది.

భార్య‌ను బ‌తికించుకునేందుకు 600కిమీ రిక్షా తొక్కిన వృద్ధుడు
X

దిశ‌, వెబ్ డెస్క్: భార్య‌ను బ‌తికించుకునేందుకు ఓ 70ఏళ్ల వ్య‌క్తి 600కిమీ వ‌ర‌కు రిక్షా తొక్కాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని సంబ‌ల్పూర్ కు చెందిన బాబు లోహ‌ర్ అనే వ్య‌క్తి భార్య అనారోగ్యానికి గురైంది. ఆమెకు ప‌క్ష‌వాతం రాగా త‌ర‌వాత ఇత‌ర అనారోగ్య స‌మస్య‌లు సైతం త‌లెత్తాయి. దీంతో స్థానిక ఆస్ప‌త్రిలో వైద్యం కోసం చూపిస్తే క‌ట‌క్ లోని ఎస్ సీబీ మెడిక‌ల్ కాలేజీకి తీసుకెళ్లాల‌ని సూచించారు. కానీ అంబులెన్స్ కోసం డ‌బ్బులు లేక‌పోవ‌డంతో అత‌డు స్థానికులను, పోలీసుల‌ను స‌హాయం చేయాల‌ని కోరాడు.

వాళ్లు ఎలాంటి సాయం చేయ‌క‌పోవంతో ఒంటరిగా చలిలోనే త‌న భార్య‌ను రిక్షాపై కూర్చోబెట్టుకుని క‌ట‌క్ లోని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాడు. అక్క‌డ వైద్యం చేయించి తిరిగి ఇంటికి తీసుకువ‌చ్చాడు. ఈ విష‌యం కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అంతే కాకుండా ఈ ఘ‌ట‌న‌ స్థానికంగా స‌రైన ఆస్ప‌త్రి లేక‌పోవ‌డం, ఎవ‌రూ మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డాన్ని చూపిస్తోంది. మ‌రోవైపు 70ఏళ్ల వ‌య‌సులోనూ భార్య కోసం వ్య‌క్తి పడిన క‌ష్టం చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

Next Story