గదుల్లో బంధించి.. బట్టలు విప్పేసి.. చేతులు కట్టేసి.. యూరిన్, టాయిలెట్ మరకలతో.. నిత్యం నరకయాతన..

by Sujitha Rachapalli |

నోయిడా సెక్టార్ 55లోని ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో వృద్ధుల పరిస్థితి కంట తడి పెట్టిస్తుంది. ఒక వృద్ధ మహిళ చేతులు కట్టి గదిలో బంధించబడిన వీడియో వైరల్ కావడం.. లక్నో సామాజిక సంక్షేమ శాఖకు పంపబడడంతో వృద్ధుల గోస వెలుగులోకి రాగా

గదుల్లో బంధించి.. బట్టలు విప్పేసి.. చేతులు కట్టేసి.. యూరిన్, టాయిలెట్ మరకలతో.. నిత్యం నరకయాతన..
X

దిశ, వెబ్‌సైట్ : నోయిడా సెక్టార్ 55లోని ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో వృద్ధుల పరిస్థితి కంట తడి పెట్టిస్తుంది. ఒక వృద్ధ మహిళ చేతులు కట్టి గదిలో బంధించబడిన వీడియో వైరల్ కావడం.. లక్నో సామాజిక సంక్షేమ శాఖకు పంపబడడంతో వృద్ధుల గోస వెలుగులోకి రాగా...ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్, నోయిడా పోలీసులు, సామాజిక సంక్షేమ శాఖ మరియు జిల్లా ప్రొబేషన్ కార్యాలయం సంయుక్తంగా దాడి చేశారు. 39 మంది వృద్ధులను రక్షించారు.

కాగా ఈ దాడిలో వృద్ధులు గదుల్లో బంధించబడినట్లు గుర్తించారు. కొందరిని బేస్‌మెంట్ లాంటి ప్రదేశాల్లో వదిలేసి చేతులు, కాళ్లు కట్టేశారు. చాలా మంది మూత్రం, మలంతో నిండిప బట్టల్లో ఉండగా.. కొందరికి ఒంటిపై సరైన దుస్తులు కూడా లేవు. జన్ కల్యాణ్ ట్రస్ట్ నడిపే ఈ ఆశ్రమం.. వృద్ధుల సంరక్షణ కోసం సిబ్బంది లేకపోయినా.. లక్షల్లో విరాళాలు, నెల నెల ఆహారం, వసతి కోసం వేలల్లో డబ్బులు వసూల్ చేస్తుంది. కాగా దాడిలో గుర్తించిన విషయాలతో షాక్ అయిన అధికారులు.. ఆశ్రమాన్ని సీల్ చేశారు. వృద్ధులను ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలకు తరలించారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ సంఘటన ప్రైవేటు వృద్ధాశ్రమాలపై కఠిన నిఘా అవసరమన్న విషయాన్ని హైలైట్ చేస్తుంది.

Next Story