Oil Price: దేశంలో చమురు కొరత లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి

by S Gopi |   (  Updated:2025-06-19 18:23:13  IST  )

పరిస్థితి అదుపులోనే ఉంది, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Oil Price: దేశంలో చమురు కొరత లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. తాజాగా ఇరాన్ ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గం హార్మూజ్ జలసంధిని మూసేస్తామని ప్రకటించడం కొత్త ఆందోళనలకు దారితీసింది. దానివల్ల ఇంధన సరఫరా దెబ్బతినవచ్చని, ధరలు పెరుగుతాయనే భయాలు ప్రజల్లో నెలకొన్నాయి. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రపంచ ఇంధన ధరలు నియంత్రణ స్థాయిలోనే ఉన్నాయని, దేశంలో చమురు కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం అన్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను భారత్ అధిగమించగలదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. చమురు ధరలు నియంత్రణ స్థాయిలోనే ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు కొరత లేదు. ఇప్పటికిప్పుడున్న ఘర్షణ వాతావరణాన్ని పరిశీలిస్తూ, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

మనదేశానికొచ్చే ఇరాన్ చమురు తక్కువే

ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్‌కు 76 డాలర వద్ద ఉంది. ఇది ఆందోళన చెందాల్సిన అంత ధరేమీ కాదు, ప్రజలు తాము వాడే ఇంధన ధరలు పెరుగుతాయని భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. భారత్ రోజుకు 55 లక్షల బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంది. ఇరాన్ నుంచి 15 లక్షల బ్యారెళ్లు వస్తాయి. కొన్ని రోజులు ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. మిగిలిన 40 లక్షల బ్యారెళ్ల ఇతర ప్రాంతాల నుంచి వస్తాయి. కాబట్టి హార్మూజ్ జలసంధి మూసేస్తే భారత్ సరఫరాను పెంచుతుందని మంత్రి వివరించారు. ఒకప్పుడు భారత్ 27 దేశాల నుంచి చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడు 41 దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఎగుమతి చేసే చమురు కూడా తగినంత మొత్తం ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదని మంత్రి పేర్కొన్నారు.

Read More .....

srael-Iran: చేదాటిన పరిస్థితులు.. వారిని రోడ్డు మార్గం గుండా దేశం దాటించేందుకు ఏర్పాట్లు

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని మూసేసే యోచనలో ఇరాన్




Next Story