Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని మూసేసే యోచనలో ఇరాన్

by S Gopi |   (  Updated:2025-06-19 18:24:44  IST  )

ప్రతీకారం తీర్చుకునేందుకు దాన్నొక మార్గంగా ఎంచుకుంటామని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు బెహ్నం సయీదీ చెప్పారు

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని మూసేసే యోచనలో ఇరాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు ముదురుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే హర్మూజ్ జలసంధిని మూసేందుకు సిద్ధమని, శతృవులపై ప్రతీకారం తీర్చుకునేందుకు దాన్నొక మార్గంగా ఎంచుకుంటామని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు బెహ్నం సయీదీ గురువారం ప్రకటనలో వెల్లడించారు. అంతర్జాతీయంగా రోజూవారీ అవసరాలకు వాడే చమురులో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి మార్గంలోనే రవాణా జరుగుతోంది.

సరఫరాకు కీలకమైన మార్గం

అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాందం, ఇరాన్‌కు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన మార్గమే హర్మూజ్ జలసంధి. ఈ మారంలో ఓ చోట అత్యంత ఇరుగ్గా 33 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో రోజూ 2 కోట్ల బ్యారెళ్ల చమురు చాలా దేశాలకు సరఫరా అవుతుంది. ఈ చమురు ప్రధానంగా ఇరాక్, ఇరాన్, సౌదీ, కువైట్, యూఏఈ దేశాల నుంచి ఎగుమతి అవుతుంది. చమురుతో పాటు ఎల్‌పీజీ గ్యాస్ రవాణాకు ముఖ్యమైన మార్గం. దీంతో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేతే ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

భారత్‌పై రూ. లక్ష కోట్ల భారం

ఇదే అంశంపై ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీ ఇక్రా కూడా హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం వల్ల హార్మూజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే చమురు, గ్యాస్ సరఫరా క్షీణించి, భారత ఆర్థికవ్యవస్థను గణనీయంగా దెబ్బతీస్తుందని గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి ప్రతికూలత ఏర్పడినా కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుందని, ప్రైవేట్ రంగ పెట్టుబడులకు అంతరాయం ఏర్పడుతుందని అభిప్రాయపడింది. భారత్‌కు అవసరమైన చమురు దిగుమతుల్లో 45-50 శాతం, సహజ వాయువు దిగుమతుల్లో 60 శాతం ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 64-65 డాలర్ల నుంచి 74-75 డాలర్లకు పెరిగింది. అధిక ముడి చమురు ధరలు ఆయిల్ కంపెనీలను నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు. ఇప్పుడు జలసంధి మూసివేస్తే అంతర్జాతీయ సరఫరాకు మరింత అంతరాయం ఏర్పడవచ్చు. భారత చమురు దిగుమతి బిల్లు 13-14 బిలియన్ డాలర్లు(రూ. లక్షల కోట్ల)పైనే భారం పడుతుందని ఇక్రా అంచనా వేసింది. అంతేకాకుందా భారత శుద్ధి, ఇంధన ధరలను ప్రభావితం చేయవచ్చు. సరఫరాను మళ్లించకపోయినా అధిక బీమా ప్రీమియంల కారణంగా భారం తప్పదు.

Read More .....

Israel-Iran: చేదాటిన పరిస్థితులు.. వారిని రోడ్డు మార్గం గుండా దేశం దాటించేందుకు ఏర్పాట్లు

Oil Price: దేశంలో చమురు కొరత లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి





Next Story