Ayodhya MP : ఓ రామా..సీతా..మీరెక్కడా..? : గుక్కపట్టి ఏడ్చిన అయోధ్య ఎంపీ..!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-04 12:29:05  IST  )

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గం (Faizabad Lok Sabha Constituency) ఎంపీ అవధేష్ ప్రసాద్(MP Awadhesh Prasad) తన నియోజక వర్గం పరిధిలోని అయోధ్య సమీపంలో దళిత యువతిపై జరిగిన హత్యాచార(Dalit Girl Raped Murder)ఘటనపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగం..వేదనతో గుక్క పట్టి బోరున ఏడ్చాడు(Big Ccried).

Ayodhya MP : ఓ రామా..సీతా..మీరెక్కడా..? : గుక్కపట్టి ఏడ్చిన అయోధ్య ఎంపీ..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గం (Faizabad Lok Sabha Constituency) ఎంపీ అవధేష్ ప్రసాద్(MP Awadhesh Prasad) తన నియోజక వర్గం పరిధిలోని అయోధ్య సమీపంలో దళిత యువతిపై జరిగిన హత్యాచార(Dalit Girl Raped Murder)ఘటనపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగం..వేదనతో గుక్క పట్టి బోరున ఏడ్చాడు(Big Ccried). హే మర్యాద పురుషోత్తమ రామా..సీతా మీరెక్కడున్నారు?(Rama..Sita, Where Are You?) అంటూ మీడియా సమావేశంలో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంపీ అవధేష్ ప్రసాద్.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయోధ్య నగర సమీపంలో 22 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం...హత్య ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బాధిత యువతి కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ముందు లేవనెత్తుతానన్నారు. మనం మన ఆడకూతుళ్లను కాపాడుకోవడంలో విఫలమవుతున్నామని అని రోధించారు. గురువారం ఓ మత సంబంధిత కార్యక్రమానికి వెళ్లిన యువతి అదృశ్యమైందని..తను ఇంటికి తిరిగి రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమోనంటూ పోలీసుల నిర్లక్ష్యంపై ఎంపీ అవధేష్ ప్రసాద్ మండిపడ్డారు. మృతదేహానికి దుస్తులు లేకుండా, శరీరంపై గాయాలు కనిపించాయని, ఆమెను తాళ్లతో కట్టివేసి దారుణంగా అత్యాచారం..హత్య చేశారని ప్రభుత్వం నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఎంపీ అవధేష్ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోనే అయోధ్య నగరం కూడా ఉంది. బాల రాముడి ఆలయం ప్రారంభోత్సవం అనంతరం జరిగిన పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ లో సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అవధేష్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. లోక్ సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత అవధేష్ ప్రసాద్ తన మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఖాళీయైన మిల్కిపూర్ నియోజకవర్గానికి ఈ నెల 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది.

గత లోక్ సభ ఎన్నికల్లో ప్రసిద్ధ రామమందిరం నిర్మించిన తర్వాత కూడా అయోధ్య ఉన్న ఫైజాబాద్ లో బీజేపీ ఓడిపోయింది. దీంతో మిల్కిపూర్ లో ఎలాగైనా గెలవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని సమాజ్ వాద్ పార్టీ పట్టుదలతో ఉంది. మిల్కిపూర్ ఉప ఎన్నికకు ముందు జరిగిన దళిత యువతి అత్యాచార ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోగా..ఈ ఘటనను ఖండిస్తున్న విపక్ష సమాజ్ వాద్ పార్టీ, కాంగ్రెస్ లు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల్లో ఆ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.


Click Here Tweet..

Next Story