- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత.. డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్న అధికారులు
తమిళనాడు(Tamil Nadu)లోని కోయంబత్తూరులో చిరుతపులి(Leopard) కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లోని కోయంబత్తూరులో చిరుతపులి(Leopard) కలకలం రేపింది. శనివారం వాల్‌పారై అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో చిరుత సంచరించింది. ఈ సందర్భంగా ఇంటి బయట ఆడుకుంటున్న రోషిణి అనే చిన్నారిని ఎత్తుకెళ్లింది. అంతేగాకుండా.. టీ.ఎస్టేట్‌లో నలుగురి కూలీలపై దాడి చేసింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు.. డ్రోన్ కెమెరాలతో చిరుత కోసం గాలిస్తున్నారు. చిన్నారి రోషిణి కోసం తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు.. చిరుత ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుత సంచరించడాన్ని స్థానిక ప్రజలు గమనించారు. రెండు రోజుల క్రితం చిరుత గొర్రెల మందపై దాడి చేసి వాటిని గాయపరిచిందని వారు చెబుతున్నారు. చిరుత సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచనలు చేశారు.






