- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Farmer Collapse : ట్రాక్టర్ తో పంట తొక్కించిన అధికారులు.. ఊపిరి వదిలిన రైతు
చేతికి అంది వచ్చిన పంటను అధికారులు ట్రాక్టర్ తో తొక్కించి నాశనం చేయడంతో తట్టుకోలేని రైతు పొలంలోనే కుప్పకూలి(Farmer Collapse) మరణించాడు.

దిశ, వెబ్ డెస్క్ : చేతికి అంది వచ్చిన పంటను అధికారులు ట్రాక్టర్ తో తొక్కించి నాశనం చేయడంతో తట్టుకోలేని రైతు పొలంలోనే కుప్పకూలి(Farmer Collapse) మరణించాడు. భార్య బిడ్డలతో కలిసి పంట నాశనం చేయవద్దని అధికారుల కాళ్లావేళ్ళా పడ్డప్పటికీ.. అధికారులు కనికరించలేదు. దీంతో దిక్కుతోచని రైతు అదే పొలంలో గుండె ఆగి మరణించాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో(MP)ని విదిష జిల్లాలో జరిగింది. సిరోంజ్‌లోని కేతన్ ఆనకట్ట ప్రాంతంలో మూల్ చంద్ అనే రైతు సుమారు 20 ఎకరాల్లో చేను సాగు చేశాడు. పంట కోతకు వచ్చిన దశలో అధికారులు ట్రాక్టర్లతో వచ్చి.. ఆ పంట మొత్తం తొక్కించి నాశనం చేశారు. కొద్దిరోజుల్లో పంట కోస్తామని, అప్పటిదాకా ఆగాలని మూల్ చంద్ తన భార్య బిడ్డలతో సహ అధికారుల కాళ్ళపై పది వేడుకున్నాడు. అయినప్పటికీ అధికారులు ఎవరూ అతని మాట పట్టించుకోలేదు.
పంట మొత్తం నాశనం చేయగా.. అది చూసి తట్టుకోలేని రైతు బాధతో చేనులోనే కుప్పకూలి మరణించాడు. రైతు మరణించిన తర్వాత అధికారులు చూసి చూడనట్టు అక్కడినుంచి జారుకున్నారు. పైగా ఈ ఘటనపై తమ చర్యలను సమర్థించుకున్నారు. అది ప్రభుత్వ భూమి అని, ప్రభుత్వ భూమిలో అక్రమంగా సాగు చేసినందుకే.. ఆ భూమిని విడిపించడానికి అలా చేశామని అన్నారు. అయితే రైతు భార్య మాత్రం ఆ భూమి తమదే అని, దానిపై గత ఏడాది కట్టిన పన్ను రసీదులు అధికారులకు చూపించినా పట్టించుకోలేదని.. ఇపుడు తమ కుటుంబం అన్యాయం అయిందని కన్నీరుమున్నీరు అయింది. ఈ నేపథ్యంలో రైతు పంటను ధ్వంసం చేసిన అధికారుల తీరుపై విమర్శలతోపాటు రాజకీయంగా దుమారం రేగుతోంది.






