ఎమ్మెల్యేల జీతాన్ని భారీగా పెంచిన ఒడిశా

by Muthe.Rajitha |

ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచింది ఒడిశా ప్రభుత్వం.

ఎమ్మెల్యేల జీతాన్ని భారీగా పెంచిన ఒడిశా
X

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచింది ఒడిశా ప్రభుత్వం. తమ జీతాలను మూడు రెట్లు పెంచే బిల్లుకు ప్రతిపక్ష, అధికారపక్ష నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే జీతం, ఇతర అలవెన్సులతో కలిపి గతంలో నెలకు రూ.1. 11 లక్షలు ఉండగా.. ఇపుడు ఏకంగా రూ.3.45 లక్షలకు పెరిగింది. దీంతో ఇప్పటివరకు దేశంలోనే ఎమ్మెల్యేల జీతాలు అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉండగా.. తాజాగా ఒడిశా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది.

అయితే భారీగా ఎమ్మెల్యేల జీతాలు పెంపుపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ఆ బిల్లుకు అసెంబ్లీలో నేతలంతా ఏకగ్రీవ ఆమోదం తెలపడం పట్ల కూడా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన బిల్లులపై రోజుల తరబడి గొడవపడి, అడ్డుకునే నేతలు.. తమ జీతాల విషయానికి వచ్చే సరికి అంతా ఏకమయ్యారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Next Story