- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Odf Plus: లక్ష్యాన్ని చేరని ఎస్‌బీఎం-జీ..54 శాతం గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ ప్లస్‌గా నిర్ధారణ
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ (ఎస్‌బీఎం-జీ) గణనీయమైన పురోగతి సాధించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ (SBM-G) గణనీయమైన పురోగతి సాధించింది. అయితే లక్ష్యంగా పెట్టుకున్న గ్రామాల్లో 80 శాతం మాత్రమే బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయి. కానీ వీటిలో కేవలం 54 శాతం గ్రామాలను మాత్రమే అధికారికంగా ‘ఓడీఎఫ్ ప్లస్ మోడల్’గా ధ్రువీకరించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ రూరల్ శానిటేషన్ వర్క్ షాప్‌లో ఈ గణాంకాలను వెల్లడించారు. దీని ప్రకారం.. జాతీయ స్థాయిలో గ్రే వాటర్ నిర్వహణ కవరేజ్ 91 శాతం గ్రామాలకు చేరుకుంది. 20 కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది 95 శాతానికి మించిపోయింది. ఇక, 87 శాతం గ్రామాల్లో ఘన వ్యర్థాలను నిర్వహిస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో 70 శాతం బ్లాక్-స్థాయి కవరేజ్ సాధించింది.
జల్ శక్తి మంత్రిత్వ శాఖ, యునిసెఫ్ ఇండియా ఆధ్వర్యంలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (DDWS) సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌షాప్‌కు వివిధ రాష్ట్రాల మిషన్ డైరెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు హాజరయ్యారు. కాగా, ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామం అంటే బహిరంగ మలవిసర్జన పూర్తిగా నిర్మూలించబడటంతో పాటు ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలి. అలాంటి గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గా గుర్తిస్తారు.






