Sri Laxmi : ఓబులాపురం మైనింగ్ కేసు... రేపు శ్రీలక్ష్మిపై మరోసారి విచారణ

by Muthe.Rajitha |   (  Updated:2025-06-09 10:46:07  IST  )

ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)లో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి(Sri Laxmi)పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) రేపు మరోసారి విచారణ చేపట్టనుంది.

Sri Laxmi : ఓబులాపురం మైనింగ్ కేసు... రేపు శ్రీలక్ష్మిపై మరోసారి విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)లో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి(Sri Laxmi)పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) రేపు మరోసారి విచారణ చేపట్టనుంది. 2022లో సీబీఐ(CBI) సమర్పించిన ఆధారాలు సరిపోవని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టివేసి, ఆమెను కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం.. హైకోర్టు తీర్పును పక్కనపెట్టి, శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని గత మేలో సీబీఐని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై మరోసారి రేపు విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో ఆమె నేర ప్రమేయం ఉందా లేదా అని నిర్ధారించి, సరైన ఆధారాలుంటే శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా రేపటి విచారణలో ఈ కేసులోని ఇతర నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌లు సీబీఐ కోర్టు తీర్పును (ఏడేళ్ల జైలు శిక్ష) సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story