- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు.. నేడు తుది తీర్పు వెలువరించనున్న CBI కోర్టు
14 ఏళ్ల తరువాత సుధీర్ఘ విచారణ అనంతరం ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో ఇవాళ సీబీఐ కోర్టు (CBI Court) తుది తీర్పు వెలువరించనుంది.

దిశ, వెబ్‌డెస్క్: 14 ఏళ్ల తరువాత సుధీర్ఘ విచారణ అనంతరం ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో ఇవాళ సీబీఐ కోర్టు (CBI Court) తుది తీర్పు వెలువరించనుంది. ఆంధ్ర-కర్ణాటక (Andhra-Karnataka) సరిహద్దు ప్రాంతంలోని అనంతపురం, బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అనంతపురం జిల్లా ఓబుళాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని ఇనుప గనులను ఓఎంసీ అక్రమంగా తవ్విందని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ 2009 డిసెంబరు 7న CBIకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఓబుళాపురంలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలను చేపట్టవద్దని జీవో నెం.71ను విడుదల చేశారు.
అయితే, కేసులో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస్‌రెడ్డి (BV Srinivas Reddy)ని A1గా, గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy)ని A2గా చేరుస్తూ వారిపై అభియోగాలు మోపింది. అదేవిధంగా ఆ సమయంలో మైనింగ్ డైరెక్టర్ వాల్మికి రాజగోపాల్, ఐపీఎస్ కృపానందం, గాలి జనార్దన్‌రెడ్డి పీఏ అలీఖాన్, అప్పటి గనులు శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy)పై కూడా సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. దాదాపు రూ.884.13 కోట్ల అక్రమంగా మైనింగ్ చేశారని సీబీఐ అధికారులు 2011లో ఫస్ట్ చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 219 మంతి సాక్షులను విచారించి.. 3,400 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ కోర్టు 14 ఏళ్ల తరువాత కేసులో తుది తీర్పును ఇవాళ వెలువరించబోతోంది. కాసేపట్లో గాలి జనార్ధన్ రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు హాజరు కాబోతున్నారు.






