- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్ 2’ సీన్స్ పై అభ్యంతరం.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
బ్లాక్‌బస్టర్ మూవీ 'ధురంధర్ 2' వివాదంలో చిక్కుకుంది. దేశ భద్రతకు ముప్పు తెచ్చే సీన్లు ఉన్నాయన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ధురంధర్ 2' వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో దేశ భద్రతకు ముప్పు వాటిళ్లిలే సన్నివేశాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని ఆదేశించింది. ఈ మూవీలో సాయుధ దళాల కార్యకాలాపాల వివరాలను బహిర్గతం చేశారని, దీని వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ సశస్త్ర సీమా బల్ (SSB)లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న దీపక్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు ఆ సినిమా కల్పిత కథ కావొచ్చనని, కానీ భద్రతాదళ సిబ్బంది లేవనెత్తిన ఆందోళనలను విస్మరించలేమని వ్యాఖ్యానిస్తూ ఈ ఆరోపణలపై విచారణ జరిపాలంటూ సెంట్రల్, సీబీఎఫ్‍సీని ఆదేశించింది. కాగా, రణ్‍వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్యాధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత మార్చిలో ప్రేక్షకుల ముందకు వచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా జూన్ 4 నుంచి జియో హాట్ స్టార్ వేదికగా భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.






