- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lok Sabha: గతేడాది జూన్ నుంచి స్కాలర్ షిప్ లు ఇవ్వలేదు
గతేడాది జూన్ నుంచి ఓబీసీలకు(OBC) స్కాలర్‌షిప్ లు ఇవ్వలేదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్(Social Justice Minister Virendra Kumar) మంగళవారం లోక్‌సభకు(Lok Sabha) తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది జూన్ నుంచి ఓబీసీలకు(OBC) స్కాలర్‌షిప్ లు ఇవ్వలేదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్(Social Justice Minister Virendra Kumar) మంగళవారం లోక్‌సభకు(Lok Sabha) తెలిపారు. కోజికోడ్ కాంగ్రెస్ ఎంపీ ఎం.కె. రాఘవన్ అడిగిన ప్రశ్నకు వీరేంద్ర కుమార్ సమాధానమిచ్చారు. 2023 అక్టోబర్‌లో విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ స్కాలర్ షిప్ పథకం కింద జూనియర్(JRF), సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ (SRF) ఫెలోషిప్ మొత్తాలను పెంచిందని వెల్లడించారు. ఈ పెరుగుదలను కవర్ చేయడానికి మంత్రిత్వ శాఖ వద్ద బడ్జెట్ లేదని చెప్పుకొచ్చారు. ఈ పథకం కోసం వ్యయాన్ని పెంచాలని మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరిందని అన్నారు. 2024-25 సంవత్సరానికి సవరించిన అంచనాలలో ప్రభుత్వం ఈ పథకానికి అదనపు నిధులను ఇవ్వలేదని.. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులను పెంచిందన్నారు. ఈ పథకం కోసం కేంద్రం నిధులను మూడు రెట్లు పెంచిందన్నారు.
స్కాలర్ షిప్ ల మొత్తం పెరుగుదల
జేఆర్ఎఫ్ లకు నెలవారీ ఫెలోషిప్ మొత్తాన్ని రూ.31 వేల నుండి రూ.37వేలకు పెంచామని.. ఎస్‌ఆర్‌ఎఫ్‌లు ప్రతి నెలా పొందే మొత్తాన్ని రూ.35 వేల నుండి రూ.42 వేలకు పెంచామని వీరేంద్రకుమార్ తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.55 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అయితే, రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.190.13 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇది 245 శాతం పెరుగుదల అని అన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య కూడా 1,338 నుండి 2,271కి పెరిగిందని ఆయన తెలిపారు. ఫెలోషిప్‌ల మొత్తం, లబ్ధిదారుల సంఖ్య పెరగడం వల్ల గతేడాది జూన్ వరకే రూ.54.50 కోట్ల విలువైన ఫెలోషిప్‌లను మాత్రమే పంపిణీ చేయగలిగిందని ఆయన అన్నారు.






