- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాల్లో ప్రాక్టికల్‍గా ఉండాలి.. ప్రశాంత్ కిశోర్‍పై దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే నంబర్లే కీలకం అని మహారాష్ట్ర సీఎం అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ఎప్పుడు సిద్ధాంతాల కంటే సంఖ్యా బలమే ముఖ్యమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) అన్నారు. ప్రజాస్వామ్యం నడవడానికి రెండు మార్గాలు ఉన్నాయని సిద్ధాం ఒక మార్గం అయితే నంబర్స్ మరొక మార్గం అన్నారు. కానీ సంఖ్యా బలం లేకుండా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లలేరని చెప్పారు. ఉదాహరణకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిహార్ మార్పు కోసం ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) పెద్ద ఎత్తున ఐడియాలజీ గురించి మాట్లాడారు. కానీ అతని పార్టీకి సీట్లు రాలేదన్నారు. అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు ప్రాక్టికల్‍గా ఉండాలని సూచించారు. ఇవాళ ముంబయిలో జరిగిన ఐఐఎంయూఎన్ లో జరిగిన ఇన్వాల్ మెంట్ ఆఫ్ యూత్ ఇన్ గవర్నెన్స్ కన్సర్న్ లో ఫడ్నవీస్ పాల్గొని మాట్లాడుతూ కీలక అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు.
ప్రభుత్వాన్ని నడిపించడంలో పార్టీల మధ్య సిద్ధాంతాలు సరిపోకపోవచ్చు. కానీ కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోగలమని ఇదే డెమోక్రసీ బ్యూటీ అన్నారు. 90వ దశకంలో భారతదేశంలో ప్రధానులు తరచుగా మారేవారని కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం పరిణితి చెందిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింతా మెరుగుపడి సిద్ధాంతాల కేంద్రీకృతంగా రాజకీయాలు నడిచే రోజులు వస్తాయని అయితే దానికి ఇంక సమయం ఉందని అభిప్రాయపడ్డారు.
Read More..
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది.. మాజీ మంత్రికి కవిత వార్నింగ్






