Nuclear: చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్.. రష్యా, చైనా మధ్య అగ్రిమెంట్

by B.Srinivas |

చంద్రునిపై ఆటోమేటెడ్ అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించేందుకు చైనా, రష్యా దేశాల మధ్య అగ్రిమెంట్ కుదిరింది.

Nuclear: చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్.. రష్యా, చైనా మధ్య అగ్రిమెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: చంద్రునిపై ఆటోమేటెడ్ అణు విద్యుత్ ప్లాంట్‌ (Nuclear Power Station) ను నిర్మించేందుకు చైనా (China), రష్యా (Russia) దేశాల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) లు ఈ నెల ప్రారంభంలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ప్లాంట్ అంతర్జాతీయ చంద్ర పరిశోధన కేంద్రం (ILRS)లో భాగమవుతుందని భావిస్తున్నారు. 2035 నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్వవనున్నట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారం, సాంకేతిక ఆధిపత్యాన్ని పెంచే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలకంగా పరిగణించబడుతుంది. అంతేగాక భవిష్యత్ అంతరిక్ష ఆవిష్కరణలకు పునాదిని సిద్ధం చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలికంగా చంద్రునిపై అన్వేషణ, శాస్త్రీయ పరిశోధనలకు వీలు కల్పిస్తుంది.

‘ఈ స్టేషన్ ఐఎల్ఆర్ఎస్ దీర్ఘకాలిక అన్‌క్రూడ్ ఆపరేషన్ల కోసం ప్రాథమిక అంతరిక్ష పరిశోధన, పరీక్షా సాంకేతికతను నిర్వహిస్తుంది. చంద్రునిపై మానవుని ఉనికిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని రోస్కోస్మోస్ తెలిపింది. ఈ ప్లాంట్ ను మానవ జోక్యం లేకుంగా, రోబోలు నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు సమాచారం. కాగా, ఐఎల్ఆర్ఎస్ మిషన్ అనేది చైనా, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్. ఇది చంద్రుని దక్షిణ ధ్రువంపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడానికి మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది.

Next Story