- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JEE, NEET పరీక్షల్లో ఫేషియల్ రికగ్నిషన్ పెట్టే యోచనలో NTA
జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి ఎంట్రన్స్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు..

దిశ, వెబ్‌డెస్క్: జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి ఎంట్రన్స్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 2026 విద్యాసంవత్సరం నుంచి అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. పరీక్షలు ఒకరికి బదులు మరొకరు రాసే అక్రమాలను అరికట్టవచ్చు. పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటపుడే అభ్యర్థులు తమ లైవ్ ఫొటోలను క్యాప్చర్ చేసే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వెబ్ క్యామ్, మొబైల్ ఫోన్ ద్వారా ఈ ఫొటోలను అప్ లోడ్ చేయడం వల్ల ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసే అవకాశాన్ని అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
గతేడాది ఢిల్లీలో కొన్ని సెలెక్టివ్ పరీక్ష కేంద్రాల్లో నీట్ పరీక్షల సమయంలో ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ను నిర్వహించారు. వచ్చ ఏడాది దీనిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఎన్టీఏ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీ, పరీక్షల్లో అక్రమాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ తరహా సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఎన్టీఏ రెడీ అవుతున్నట్లు సమాచారం.






