- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JEE Main 2025 Final Results: జేఈఈ ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. స్పందించిన NTA ఫైనల్ ‘కీ’ ఎప్పుడంటే?
జేఈఈ మెయిన్స్ ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠత వీడింది. ఫైనల్ కీ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా స్పందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (JEE Main 2025 Final Results) జేఈఈ మెయిన్స్ ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠత వీడింది. ఫైనల్ కీ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా స్పందించింది. దేశవ్యాప్తంగా జేఈఈ విద్యార్థులు అయోమయానికి గురవుతున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం జేఈఈ మెయిన్స్ ఫైనల్ కీ ని విడుదల చేసిన (National Testing Agency) ఎన్టీఏ.. కొద్దిసేపటికే దానిని అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే జేఈఈ ఫలితాలపై ఎన్టీఏ శుక్రవారం స్పందించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫైనల్ కీ అందుబాటులో ఉంటుందని ఎక్స్ వేదికగా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫైనల్ ‘కీ’ని https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఎన్టీఏ నిర్వహించిన సంగతి విదితమే. గత జనవరి, ఇటీవల జరిగిన రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు.






