- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amit Shah : అమిత్ షా నివాసం ముట్టడికి ఎన్ఎస్ యూఐ యత్నం.. ఢిల్లీలోఉద్రిక్తత
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) నివాసం(House) ముట్టడికి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐ(NSUI )ప్రయత్నించడం(Attempts) ఉద్రిక్తత(Tension)కు దారితీసింది

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) నివాసం(House) ముట్టడికి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐ(NSUI )ప్రయత్నించడం(Attempts) ఉద్రిక్తత(Tension)కు దారితీసింది. అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన రోజునే భారత్ నిజమైన స్వాంతంత్ర్యాన్ని పొందిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు పెద్ధ సంఖ్యలో అమిత్ షా నివాసం ముట్టడికి ప్రయత్నించారు. ఆర్ ఎస్ ఎస్ ను నిషేధించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బారీకేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు యత్నం చేశారు. దీంతో పోలీసులకు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తల మధ్య తోపులాట సాగింది. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అమిత్ షా సహా కేంద్ర మంత్రుల నివాసం వద్ధ భద్రత కట్టుదిట్టం చేశారు.
అంతకుముందు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. భగవత్ వ్యాఖ్యలు 1947దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ భగవత్ చేసిన వ్యాఖ్యలు స్వాతంత్ర్య పోరాటాన్ని, బ్రిటీష్ వారిపై పోరాడిన యోధులను, అమరులను కించపరిచేవిగా ఉన్నాయని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకు వస్తాయని మండిపడ్డారు.






