- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీతో దోవల్ భేటీ.. త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ కూడా..!
పీఎం మోడీని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిసి, సరిహద్దు దగ్గరి పరిస్థితిని వివరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ మిసైల్, డ్రోన్ దాడులు చేయడంతో ఇరుదేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయిన ప్రధాని మోడీ.. సరిహద్దు వద్ద పరిస్థితిని తెలుసుకున్నారు. రెండు దేశాల్లో పరిస్థిలు, రక్షణ విషయంలో భారత్ సన్నద్ధత గురించి ప్రధానికి దోవల్ పూర్తిగా వివరించారు. సరిహద్దుకు సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులు, డ్రోన్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది.
త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
దోవల్, ప్రధాని సమావేశం ఒకపక్క జరుగుతుండగానే.. మరో పక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. పాక్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఎలా ప్రతిస్పందించాలి? భారత్ ఎలాంటి సన్నాహక చర్యలు చేపడుతోంది? వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు.






