ఇక కుక్కలకు క్యూఆర్ కోడ్, జీపీఎస్

by Muthe.Rajitha |

వీధి కుక్కల కోసం ప్రభుత్వం ఓ కొత్త విధానం తీసుకు వస్తోంది. వీధి కుక్కలకు ఇకపై క్యూఆర్ కోడ్, జీపీఎస్ అమర్చనుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా కార్పొరేషన్ స్ట్రీట్ డాగ్స్ కోసం ఈ కొత్త విధానం తీసుకు వచ్చింది.

ఇక కుక్కలకు క్యూఆర్ కోడ్, జీపీఎస్
X

దిశ, వెబ్ డెస్క్ : వీధి కుక్కల కోసం ప్రభుత్వం ఓ కొత్త విధానం తీసుకు వస్తోంది. వీధి కుక్కలకు ఇకపై క్యూఆర్ కోడ్, జీపీఎస్ అమర్చనుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా కార్పొరేషన్ స్ట్రీట్ డాగ్స్ కోసం ఈ కొత్త విధానం తీసుకు వచ్చింది. కుక్కల మెడకు అమర్చిన జీపీఎస్ ఆధారంగా వాటి సంచారాన్ని తెలుసుకోవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా వాటి స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ వివరాలు తెలుసుకోవచ్చని కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ కు తరలించే ఆదేశాలు విడుదలైన క్రమంలో జరుగుతున్ననిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో షిమ్లా కార్పొరేషన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండటమే కాకుండా, ఒక ఏడాదిలో వందలాది మంది కుక్కకాటుకు గురయ్యారు. అనేక మంది పిల్లలు, వృద్ధులు వీటి బారిన పడి ప్రాణాలు వదిలేసినా ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుక్కలకు క్యూఆర్ కోడ్, జీపీఎస్ విధానం ఏర్పాటు చేయడంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story