- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. సాయంత్రం 4గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. సాయంత్రం 5గంటల నుండి 6 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 6.30 నిమిషాలకు జాతీయ ఎన్నికల అధికారి ద్వారా ప్రకటన విడుదల కానుంది. 19న నామినేషన్ల ప్రక్రియ అనంతరం 20న అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం బీజేపీ జాతీయ కార్యాలయంలో జరగనుంది. ఇదిలా ఉంటే బీజేపీ 20 వ అధ్యక్షుడిగా బిహార్ కు చెందిన నితిన్ నబీన్ సిన్హాను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.






