- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. భారీగా జీతాలు
ఎయిర్ పోర్టులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ పోర్టులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) శుభవార్త చెప్పింది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 14 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఎలక్ట్రానిక్స్ లేదా టెలీకమ్యూనికేషన్స్ లేదా రేడియా ఇంజనీరింగ్ లో డిప్లమో, సంబంధిత రంగాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవనం కలిగి ఉండాలి.
అలాగే జూనియర్ అసిస్టెంట్ (HR) పోస్టుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) పోస్టుకు టెన్త్, డిగ్రీ, మెకానికల్ /ఆటో మొబైల్/ఫైర్ లో మూడేళ్లు రెగ్యులర్ డిప్లమో ఉన్నవారు, 12వ తరగతి రెగ్యులర్ స్టడీస్ లో పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ లిటరసీ పరీక్ష కూడా ఉంటుంది.
సీనియర్ అసిస్టెంట్ కు నెలకు రూ.36,000 నుంచి రూ. 1,10,000 వరకూ జీతం ఉంటుంది.
జూనియర్ అసిస్టెంట్ కు నెలకు రూ.31,000 నుంచి 92,000 వరకూ జీతం ఇస్తారు.
అభ్యర్థుల వయసు 06/12/2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరి వారికి వయసు సడలింపు ఉంటుంది.
జనరల్/ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ-ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, AAIలో ఒక ఏడాదిపాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. అభ్యర్థులు జనవరి 11 ,2026లోగా దరఖాస్తు చేసుకోవాలి.






