- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sonia Gandhi : సోనియా గాంధీకి సభా హక్కుల నోటీసు
ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల(Parliament Budjet Sessions) నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల(Parliament Budjet Sessions) నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. అయితే రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ(MP Sonia Gandhi) మాట్లాడుతూ ద్రౌపదీ ముర్ముపై 'బీద మహిళ'(Poor Lady) అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. బడ్జెట్ పై రాష్ట్రపతి సుధీర్ఘ ప్రసంగం అనంతరం.. సోనియా గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'సుధీర్ఘ ప్రసంగం లాస్ట్ కి వచ్చేసరికి పాపం పూర్ లేడీ అలసిపోయారు' అని అన్నారు. ఇక అక్కడే ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాష్ట్రపతి ప్రసంగం పరమ బోరింగ్ గా ఉందని అభివర్ణించారు.
రాష్ట్రపతిపై వీరు చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్(President Bhavan) ఖండించింది. సోనియా గాంధీవి అవమానకర వ్యాఖ్యలు అంటూ మండిపడింది. ప్రసంగం సమయంలో అలసిపోలేదు. ఆమె ప్రసంగం పేదల, మహిళల, రైతుల హక్కుల కోసం ఉందన్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి రాచరిక పోకడలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి గిరిజన సమాజం నుంచి వచ్చారని, ఆమె ఒక స్వచ్ఛమైన నేత అని.. పేద మహిళ అంటూ వ్యాఖ్యానించడం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు. ఈ వ్యవహారంపై సోనియా గాంధీ మీద సుప్రీంకోర్టుతోపాటు.. దేశంలో అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే సోనియా గాంధీపై రాజ్యసభలో పలువురు బీజేపీ ఎంపీలు సభాహక్కుల నోటీసులు ఇచ్చారు.






