Mamata Banerjee: నేను బతికి ఉన్నంతవరకు ఉద్యోగలు కోల్పోలేరు- దీదీ

by Shamantha N |   (  Updated:2025-04-07 15:06:55  IST  )

పశ్చిమబెంగాల్‌లో (West Bengal)టీచర్ రిక్రూట్ మెంట్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.

Mamata Banerjee: నేను బతికి ఉన్నంతవరకు ఉద్యోగలు కోల్పోలేరు- దీదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్‌లో (West Bengal)టీచర్ రిక్రూట్ మెంట్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. తాను బతికి ఉన్నంత కాలం అర్హులెవరూ తమ ఉద్యోగాలు కోల్పోలేరని హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్యోగాలు పోగొట్టుకున్న టీచర్లతో సోమవారం నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో దీదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీట్‌ ప్రవేశ పరీక్ష మీద సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విద్యా వ్యవస్థను ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఉంటే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? అనే విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వాలి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వ్యాపం కేసులో చాలా మంది చనిపోయారు.వాళ్లకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. నీట్‌ ప్రవేశ పరీక్షపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ పరీక్షను సుప్రీం కోర్టు రద్దు చేయలేదు. అలాంటప్పుడు బెంగాల్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. బెంగాల్ ప్రతిభను చూసి భయపడుతున్నారా? మాకు సమాధానం ఇవ్వాలి’’ అని మమత అన్నారు.

మీకు అండగా నిలబడతాం..

ఈ విషయాలపై సుప్రీం కోర్టు ఒక స్పష్టత ఇస్తే.. మేం రుణపడి ఉంటామని దీదీ అన్నారు. ఒకవేళ ఇవ్వకుంటే.. మీకు అండగా ఎలా నిలబడాలో మేం దారి కనిపెడతామన్నారు. రెండు నెలలుగా మీరు ఇబ్బంది పడుతున్నారని టీచర్లను ఉద్దేశించి అన్నారు. అలాగని మిమ్మల్ని 20 ఏళ్లు బాధపెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ రెండు నెలలకు కూడా మీకు పరిహారం చెల్లిస్తామన్నారు. మూడు నెలల్లో నియామక ప్రక్రియ తిరిగి చేపట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని.. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కానీ, ఈ వ్యవహారంపై స్పష్టత కోరామని చెప్పారు. ఆ స్పష్టత రాగానే తీర్పుపై రివ్యూ పిటిషన్‌ కూడా వేస్తామన్నారు. మీకింకా ఉద్యోగాల నుంచి తొలగించినట్లు లేఖలు రాలేదు కాబట్టి మీ పని మీరు చేసుకోండని అన్నారు. టీచర్ల ఉద్యోగాలకు తాను భరోసా ఇచ్చారు. తాను బతికి ఉన్నంతవరకు అర్హులెవరూ రోడ్డున పడే పరిస్థితి రానివ్వనని అన్నారు. 2016లో జరిగిన 25 వేల టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. ఈ తీర్పుపై స్పందించిన టీఎంసీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీనిపై మరోసారి స్పందిస్తూ.. దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More..

Nadda: వక్ఫ్ బోర్డును నియంత్రించాలని కేంద్రం కోరుకోవడం లేదు.. బీజేపీ చీఫ్ నడ్డా

Next Story