Nadda: వక్ఫ్ బోర్డును నియంత్రించాలని కేంద్రం కోరుకోవడం లేదు.. బీజేపీ చీఫ్ నడ్డా

by B.Srinivas |

వక్ఫ్ బోర్డులను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి నడ్డా స్పష్టం చేశారు.

Nadda: వక్ఫ్ బోర్డును నియంత్రించాలని కేంద్రం కోరుకోవడం లేదు.. బీజేపీ చీఫ్ నడ్డా
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బోర్డు (waqf Board) లను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (Jp Nadda) స్పష్టం చేశారు. ముస్లిం సమాజానికి విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అందించేందుకు సహాయం చేయడానికి వక్ఫ్ బోర్డులు చట్టబద్ధంగా పనిచేస్తాయని తెలిపారు. బీజేపీ (BJP) 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తున్న వారు దానిని నిబంధలన ప్రకారం నిర్వహించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని నొక్కి చెప్పారు.

వక్ఫ్ బోర్డు ఆస్తులు, నిధులను ముస్లింలకు విద్యను ప్రోత్సహించడానికి, ఉపాధి అవకాశాలను అందించడానికి అంకితం చేయాలన్నారు. తుర్కియే సహా అనేక ఇతర ముస్లిం దేశాల ప్రభుత్వాలు కూడా అక్కడి వక్ఫ్ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయన్నారు. ‘వక్ఫ్ బోర్డును నడుపుతున్న వారు నిబంధనల ప్రకారం పనిచేయాలని మాత్రమే ప్రభుత్వం చెబుతోంది. అంతేగానీ వక్ఫ్ బోర్డును నియంత్రించాలనుకోవడం లేదు. దీన్ని నిర్వహించే వ్యక్తులు చట్ట పరిధిలో పనిచేస్తారని, నియమాలను పాటిస్తున్నారని నిర్ధారించుకోవడమే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

Next Story